తెలంగాణ

telangana

drugs case: డ్రగ్స్ కేసులో సుశాంత్​సింగ్ స్నేహితుడు అరెస్ట్

By

Published : May 29, 2021, 4:05 AM IST

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మరోకరిని అరెస్టు చేసింది ముంబై ఎస్‌సీబీ. సిద్దార్థ్‌ పితాని అనే వ్యక్తిని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ముంబై ఎస్‌సీబీ.. ట్రాన్సిట్‌ వారంట్‌ పరారీపై ముంబై తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు
Bollywood drug case


బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడిని ముంబై ఎన్​సీబీ అధికారులు.. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసులో.. డ్రగ్స్‌ కేసు తెరపైకి వచ్చింది. ఆ కేసులో ఇప్పటికే ముంబై ఎన్​సీబీ (NCB) అధికారులు పలువురిని విచారించగా గతంలో సిద్దార్ధ్ పితాని అనే వ్యక్తిని విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.

విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతుండటంతో అతని కోసం ఓ ప్రత్యేక బృందం ఇటీవలే హైదరాబాద్ వచ్చింది. ఎన్​సీబీ అధికారులు స్థానిక పోలీసుల సాయతో సిద్దార్ధ్‌ని.. గురువారం అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబై తీసుకువెళ్ళిన అధికారులు... ముంబై కోర్టులో హాజరుపర్చగా జూన్‌ 1 వరకు విచారణకు అనుమతించింది.

ఇవీ చూడండి:Covaxin Timeline: టీకా తయారీకి ఎన్ని రోజులు?

ABOUT THE AUTHOR

...view details