తెలంగాణ

telangana

ETV Bharat / business

వరుసగా ఐదో నెలలోనూ పెరిగిన ఎల్​పీజీ​ ధర

వరుసగా ఐదో నెల ఏటీఎఫ్​, ఎల్​పీజీ ధరలు పెంచాయి దేశీయ చమురు సంస్థలు. ఏటీఎఫ్​పై 2.6 శాతం, రాయితీ లేని వంట గ్యాస్​పై రూ.19 పెంచినట్లు ప్రకటించాయి.

lpg
ఎల్​పీజీ

By

Published : Jan 1, 2020, 3:31 PM IST

Updated : Jan 1, 2020, 4:39 PM IST

అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా జెట్‌ ఇంధనం ధర 2.6 శాతం, రాయితీ లేని వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.19 పెంచాయి దేశీయ చమురు సంస్థలు.

పెరిగిన ధరలు ఇలా..

ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్​) గా పిలిచే జెట్‌ ఇంధనం.. కిలో లీటర్‌కు రూ.1,637.25 పెరిగి రూ.64,323.76లకు చేరింది. గతేడాది జూన్‌ తర్వాత ఇదే అత్యధిక వృద్ధి. విమానయాన రంగంలో పోటీతో సతమతమవుతున్న సంస్థలకు పెరిగిన ధరలు మరింత భారం కానున్నాయి. రేటు పెరిగినప్పటికీ లీటర్‌ ఏటీఎఫ్ ధర పెట్రోల్‌, డీజిల్‌ కన్నా తక్కువే ఉంది.

రాయితీ లేని 14.2 లీటర్ల వంటగ్యాస్​ సిలిండర్ ధర రూ.19 పెరిగి.. రూ.714 చేరుకుంది. గతేడాది సెప్టెంబర్‌ నుంచి వరుసగా ఐదు నెలలుగా వంటగ్యాస్ ధర పెరుగుతోంది. ఈ ఐదు నెలల్లో సబ్సిడీ లేని సిలిండర్ ధర రూ.139 పెరిగింది. ముంబయిలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే కిరోసిన్‌ ధర 26 పైసలు పెరిగింది.

ఇదీ చూడండి:మాల్యాకు న్యూఇయర్ షాక్​- ఆస్తుల వేలానికి కోర్టు అనుమతి!

Last Updated : Jan 1, 2020, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details