స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 199 పాయింట్లు బలపడి 31,643 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో 9,251 వద్దకు చేరింది.
భారత వృద్ధి రేటుపై ఆందోళన వ్యక్తం చేస్తూ మూడీస్ విడుదల చేసిన నివేదికతో పాటు ఆటో రంగంలో అమ్మకాల ఒత్తిడి కారణంగా ఆరంభంలో నమోదైన భారీ లాభాల నుంచి వెనక్కి తగ్గాయి సూచీలు.
లాభాలకు కారణాలు..
కరోనా సంక్షోభంలో చిక్కుకున్న అన్ని రంగాలను ఆదుకునేందుకు కేంద్రం భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తుందన్న ఆశలు నేటి లాభాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. వీటికి తోడు ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు లాభాలతో ముగియడం కూడా మన మార్కెట్లకు కలిసొచ్చినట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 32,088 పాయింట్ల అత్యధిక స్థాయి... 31,598 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 9,382 పాయింట్ల గరిష్ఠ స్థాయి... 9,238 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.