తెలంగాణ

telangana

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే

By

Published : Feb 16, 2021, 8:21 PM IST

కాంగ్రెస్​ సీనియర్​ నేత మల్లికార్జున ఖర్గే.. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగనున్నారు. ఆజాద్​ పదవీ కాలం ముగియగా.. కాంగ్రెస్​ పార్టీ తాజా ప్రతిపాదనకు ఎగువ సభ ఛైర్మన్​ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు.

Congress leader Mallikarjun Kharge
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గేని గుర్తిస్తున్నట్లు ప్రకటన విడుదలైంది. ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న గులాం నబీ ఆజాద్‌ రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం ఇటీవలే ముగిసింది. ఈ నేపథ్యంలో మార్పులకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు‌ అంగీకారం తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు వెంకయ్య. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచే అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేశారు. మల్లికార్జున ఖర్గే.. మంగళవారం నుంచి ఎగువసభలో ప్రతిపక్ష నేత హోదాలో కొనసాగనున్నారు.

ABOUT THE AUTHOR

...view details