Puri Jagannath Rathyatra 2024 : విశ్వప్రసిద్ధ జగన్నాథుని రథయాత్ర సందర్భంగా పూరీ నగరం భక్తులతో నిండిపోయింది. ఒడిశాతో పాటు దేశంలోని నలు మూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో శ్రీక్షేత్రం పరిసరాలతో పాటు అక్కడి వీధులన్నీ 'జై జగన్నాథ' నినాదాలతో మార్మోగాయి. ఆదివారం సాయంత్రం జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర వారి రథాలు నందిఘోష, తాళధ్వజం, పధ్వధ్వజం రథాలపై తల్లి చెంతకు పయనమయ్యారు.
#WATCH | Large number of devotees gather in Odisha's Puri to take the darshan of Lord Jagannath as the two-day Lord Jagannath Rath Yatra to commence today. pic.twitter.com/C1qFOnLn6e
— ANI (@ANI) July 7, 2024
ఆదివారం తెల్లవారు జామున రత్న సింహాసనంపై చతుర్థామూర్తులు కొలువుదీరారు. అనంతరం జగన్నాథుడి నవయవ్వన రూపాలంకరణ చేశారు. మంగళహారతి, మైలం, అబకాశ, తిలకధారణ, గోపాలవల్లభ సేవలు తర్వాత నేత్రోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ రథాలపై చెరాపహరా ( బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చడం) చేశారు. అనంతరం ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువచ్చారు. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేశారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెట్టారు. అవి అందుకోవడానికి కోసం భక్తులు పోటీ పడ్డారు.
ఆ తర్వాత ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథంపై ప్రతిష్ఠించారు. భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా దాదాపు ఐదడుగుల ఏడు అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని భక్తుల జయధ్వానాల మధ్య ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకు వచ్చి నందిఘోష రథం మీద ఉంచారు. ఇలా మూడు విగ్రహాలను రథాలపై కూర్చుండబెట్టే వేడుకను 'పహాండీ' అంటారు.
#WATCH | Odisha | Puri Maharaja sweeps chariots as part of Rath Yatra rituals.
— ANI (@ANI) July 7, 2024
Dibyasingha Deb, the Gajapati Maharaja of Puri, sweeps the chariots of Lord Jagannath and his siblings - Balabhadra and Goddess Subhadra before they are ceremoniously pulled by devotees.
(Source -… pic.twitter.com/i62KTQ05Bv
కస్తూరి కళ్లాపి
ఊరేగింపునకు సిద్ధంగా ఉన్న స్వామిపై పూరీ సంస్థానాధీశులు గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశారు. అలాగే బలరాముడిని, సుభద్రాదేవిని కూడా అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగించారు. జగన్నాథుని రథం మీద ఉండే ప్రధాన పూజారి ఆదేశాల మేరకు కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి 'జై జగన్నాథా' అని బిగ్గరగా అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెట్టారు.
భక్తజన సంద్రంలో పురుషోత్తముడు
తొలుత బలభధ్రుడు తాళధ్వజ రథంపై తల్లి చెంతకు పయనమయ్యారు. ఆ తర్వాత దేవీ సుభద్రదేవీ, చివరిగా పురుషోత్తముని నందిఘోష్ రథం భక్త జన సాగరంలో మెల్లగా ముందుకు కదిలింది. భక్తజన ఘోష మధ్య పూరీ బొడొదండోలో జగన్నాథుడు దర్శనమిచ్చారు.
రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జగన్నాథ రథయాత్ర తొలిసారి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొన్నారు. మూడు రథాల 'పరిక్రమ' చేసి దేవతలకు నమస్కరించారు. ఒడిశా ముఖ్యమంత్రి చరణ్ మాఝీ, మాజీ సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జగన్నాథ రథం తాళ్లను లాగి లాంఛనప్రాయంగా యాత్ర ప్రారంభించారు.
#WATCH | Odisha: President Droupadi Murmu arrives in Puri to take darshan of the Lord Jagannath as the two-day Lord Jagannath Rath Yatra in Puri to commence today.
— ANI (@ANI) July 7, 2024
Chief Minsiter Mohan Charan Majhi, former Odisha Chief Minister Naveen Patnaik and other dignitaries also present… pic.twitter.com/kT0TKfTsIC
పూరీ జగన్నాథుని రథయాత్రకు అంతా రెడీ- 1971 తర్వాత తొలిసారి ఇలా!
ఏటా కొత్త రథం- 12రోజుల పాటు ఉత్సవాలు- పూరీ జగన్నాథుడి రథయాత్ర విశేషాలివే! - Puri Rath Yatra 2024