ETV Bharat / bharat

గోంగూర రొయ్యల కర్రీ - ఈ టిప్స్​ పాటిస్తూ చేస్తే టేస్ట్​ సూపర్​ హిట్​! - How to Prepare Gongura Prawns Curry - HOW TO PREPARE GONGURA PRAWNS CURRY

Gongura Prawns Recipe : చాలా మందికి రొయ్యలతో చేసిన వంటలంటే ఇష్టం. అయితే వాటితో వెరైటీలు చేయడం రాక.. ఏదో ఒక మసాలాలు వేసి కూర చేస్తుంటారు. అయితే ఈసారి అలా కాకుండా గోంగూర రొయ్యల కర్రీ చేయండి. టేస్ట్​ అద్దిరిపోతుంది. చేయడం రాదంటారా..? అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.

Gongura Prawns
How to Prepare Gongura Prawns Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 5:28 PM IST

How to Prepare Gongura Prawns Curry : చాలా మంది చేపల కూరను ఈజీగా వండేస్తారు. కానీ ప్రాన్స్(రొయ్యల) విషయానికొస్తే కాస్త వెనకడుగు వేస్తారు. మనవల్ల కాదులే అని కొందరు.. టేస్ట్​ సరిగ్గా కుదరదని ఇంకొందరు భావిస్తుంటారు. అందుకే రొయ్యలతో వెరైటీ వంటలు ఉన్నా అవి చేయడం రాక.. ఏదో ఒక మసాలాలు వేసి మామూలు కూర చేస్తుంటారు. ఇకపై అలాంటి వారు, బ్యాచిలర్స్, మొదటిసారి చేసే వారు కూడా ఈ టిప్స్​ ఫాలో అవుతూ చేస్తే.. పుల్ల పుల్లగా నోరూరించే గోంగూర రొయ్యల కర్రీని చాలా సింపుల్​గా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మరి, లేట్​ చేయకుండా ఈ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో చూసి.. ఇంట్లోనే ప్రిపేర్​ చేసి లొట్టలేసుకుంటూ లాగించండి.

గోంగూర రొయ్యల కర్రీ ప్రిపేర్‌ చేయడానికి కావాల్సిన పదార్ధాలు :

  • శుభ్రం చేసిన రొయ్యలు- పావు కేజీ
  • నూనె- సరిపడినంత
  • ఉప్పు - సరిపడినంత
  • దాల్చిన చెక్క - కొద్దిగా
  • లవంగాలు- 4
  • యాలకులు-4
  • బిర్యానీ ఆకు
  • జీలకర్ర- టీస్పూన్‌
  • కరివేపాకు రెమ్మలు-2
  • పచ్చిమిర్చి -4
  • ఉల్లిపాయలు-2 (సన్నగా కట్‌ చేసుకోవాలి)
  • అల్లం వెల్లులి పేస్ట్- టేబుల్‌ స్పూన్‌
  • టమాటలు- ఒకటి
  • పసుపు- టీస్పూన్‌
  • కారం- రుచికి సరిపడా
  • ధనియాల పొడి- టీస్పూన్‌
  • వేయించిన జీలకర్ర పొడి- టీస్పూన్‌
  • గరం మసాలా-టీస్పూన్‌
  • గోంగూర ఆకులు- పావు కేజీ
  • నీళ్లు- సరిపడినన్నీ
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

సండే స్పెషల్ : రొయ్యలతో ఈ వెరైటీలు - వహ్వా అనాల్సిందే!

గోంగూర రొయ్యల కర్రీ తయారీ విధానం :

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి పాన్‌ పెట్టి కొద్దిగా ఆయిల్‌ వేసి.. వేడెక్కాక పచ్చి రొయ్యలు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి రొయ్యలలో నీరు పోయేదాకా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత ఇదే పాన్‌లో ఇంకా కొద్దిగా ఆయిల్‌ వేసి.. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
  • ఇప్పుడు పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, ఉల్లిపాయ ముక్కలను వేసి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ వచ్చేంత వరకు ఫ్రై చేయండి.
  • అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్‌, టమాట ముక్కలను వేసి కలపండి. తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఈ మిశ్రమంలోకి బాగా కడిగిన గోంగూర ఆకులు వేసి 5 నిమిషాలు ఉడికించండి.
  • తర్వాత రొయ్యలను వేసి, కొన్ని నీళ్లు యాడ్‌ చేసుకుని 10 - 15 నిమిషాలు సన్నని మంట మీద ఉడికించుకోండి.
  • ఇలా ఉడికించుకోవడం వల్ల రొయ్యలకు కారం, ఉప్పు, మసాలాల రుచి బాగా పడుతుంది.
  • కర్రీని దింపేసుకునే ముందు కొద్దిగా సన్నని కొత్తిమీర తరుగు, కరివేపాకు, గరం మసాలా వేసుకుని కలుపుకుని పక్కన పెట్టుకుంటే.. ఎంతో రుచికరమైన గోంగూర రొయ్యల కర్రీ రెడీ.
  • నచ్చితే మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. రైస్​లోకి​ మాత్రమే కాదు.. చపాతీ, పరాటా.. ఇలా ఎందులోకైనా అద్దిరిపోద్ది.

prawns recipe : ఆహా..! ఏమి రుచి... అనరా మైమరచి..

సండే స్పెషల్​ - "కాజు మష్రూమ్ మసాలా కర్రీ"- రైస్​లోకి​ మాత్రమే కాదు చపాతీల్లోకి సూపర్‌ కాంబినేషన్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.