తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జనతా కర్ఫ్యూలో పాల్గొన్న మీరంతా సైనికులే'

కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తలపెట్టిన 'జనతా కర్ఫ్యూ'కు వస్తున్న స్పందనపై హర్షం వ్యక్తంచేశారు ప్రధాని. జనతా కర్ఫ్యూలో పాల్గొన్న ప్రజలను సైనికులతో పోల్చారు మోదీ.

People valued soldiers in fight against coronavirus
జనతా కర్ఫ్యూపై ప్రధాని ప్రశంసలు

By

Published : Mar 22, 2020, 2:26 PM IST

జనతా కర్ఫ్యూలో భాగంగా భారత పౌరులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇలా ఇంటి దగ్గరే ఉండి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కృషి చేస్తున్న పౌరులపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. కరోనాపై పోరాటం చేస్తున్న ప్రజలంతా సైనికులేనని అభివర్ణించారు మోదీ.

14 గంటలపాటు(ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు) కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా టీవీ చూస్తూ, మంచి ఆహారం తీసుకుని జనతా కర్ఫ్యూను అస్వాదించాలని సూచించారు మోదీ.

"కొవిడ్​-19పై యుద్ధం చేస్తున్న మీరంతా సైనికులే. మీరు అప్రమత్తంగా ఉంటూ తీసుకుంటున్న జాగ్రత్త.. లక్షలాది మంది ప్రాణాలు కాపాడేందుకు సహాయపడుతుంది."

-ప్రధాని నరేంద్ర మోదీ

సామాజిక దూరం, డిజిటల్ చెల్లింపుల ద్వారా కూడా వైరస్ వ్యాపించకుండా నివారించవచ్చని చెప్పారు మోదీ.

ఇదీ చూడండి:జనతా కర్ఫ్యూ: 'మహా'నగరం మూతపడిన వేళ...

ABOUT THE AUTHOR

...view details