తెలంగాణ

telangana

By

Published : Dec 25, 2019, 4:18 PM IST

ETV Bharat / bharat

వాజ్​పేయీ విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ

మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ విగ్రహాన్ని ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. వాజ్​పేయీ పేరు మీద నిర్మించబోయే వైద్య విశ్వవిద్యాలయానికి పునాదిరాయి వేశారు.

Prime Minister Narendra Modi lays foundation stone
వాజ్​పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ జయంతి సందర్భంగా ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోదీ. అటల్​ బిహారీ వాజ్​పేయీ వైద్య విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా వైద్య సేవలను విస్తరించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు.

ఈ విద్యాలయం కోసం ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. లఖ్​నవూ నుంచి లోక్​సభకు వాజ్​పేయీ 5 సార్లు ప్రాతినిధ్యం వహించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details