తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎయిర్​లిఫ్ట్​: తొలిరోజు 10విమానాలు.. 2300మంది

'వందే భారత్​' మిషన్​ తొలిరోజు షెడ్యూల్​ను కేంద్రం విడుదల చేసింది. భారత్​ నుంచి పలు దేశాలకు గురువారం 10విమానాలు బయలుదేరనున్నాయి. వాటిల్లో దాదాపు 2,300మందిని స్వదేశానికి తీసుకురానున్నారు.

LIST OF FLIGHTS TO DEPARTURE TODAY ON THE MISSION "VANDE BHARAT"
ఎయిర్​లిఫ్ట్​: తొలిరోజు 10విమానాలు.. 2300మంది

By

Published : May 7, 2020, 10:50 AM IST

ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద తరలింపుగా మిగిలిపోయే 'వందే భారత్​' మిషన్​ నేటి నుంచి ప్రారంభం కానుంది. కరోనా విజృంభణ వేళ వివిధ దేశాల్లో చిక్కుకున్న 14,800మంది భారతీయులను..7రోజుల్లో 64విమానాల ద్వారా స్వదేశానికి రప్పించనుంది ప్రభుత్వం. మిషన్​లో భాగంగా గురువారం జరగనున్న కార్యకలాపాల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.

దాదాపు 2,300మందిని తీసుకురావడానికి దేశంలోని వివిధ విమానాశ్రయాల నుంచి 10 విమానాలు బయలుదేరనున్నాయి.

ఈ ఆపరేషన్​కు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.

అమెరికాలో...

అమెరికాకు 7 కమర్షియల్​ ఫ్లైట్లు నడపనుంది భారత ప్రభుత్వం. ఇవి శనివారం నుంచి ప్రారంభమవుతాయి. అయితే ప్రయాణికులను 'కంప్యూటరైజ్డ్​​ డ్రా' ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఈ నాన్​-షెడ్యూల్డ్​ ఫైట్లలో పరిమితి సంఖ్యలో సీట్లు ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు.

వీసా గడువు ముగిసిన వారు, ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఉన్నవారు, జీవానోపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కార్మికులకే తొలి ప్రాధాన్యం ఉంటుందని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రావెల్​ అడ్వైజరీ జారీ చేసింది.

  • విమాన ఖర్చులు ప్రయాణికులే భరించాలి.
  • ప్రయాణికులను గుర్తించి వారి వివరాలను ఎయిర్​ ఇండియా అధికారులకు అందజేతే. అనంతరం అధికారులు ప్రయాణికులతో సంప్రదింపులు.
  • ముందు బుక్​ చేసుకున్న టికెట్లకు సంబంధించిన వివరాల కోసం అధికారులను విడిగా సంప్రదించాలి.
  • బోర్డింగ్​కు ముందు అందరికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహిస్తారు. వైరస్ లక్షణాలు లేకుంటేనే అనుమతి ఉంటుంది.
  • ప్రయాణికులందరూ తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • మాస్క్​లు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.
  • స్వదేశం చేరుకున్నాక సొంత ప్రాంతాలకు చేరుకునే ఏర్పాట్లు ఆయా రాష్ట్రాలే చూసుకోవాలి.
  • ప్రయాణికులకు వైద్య పరీక్షలు, క్వారంటైన్​ కేంద్రాల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే.
  • స్వదేశం వచ్చాక తప్పనిసరిగా 14 రోజులు క్వారంటైన్​ కేంద్రంలో ఉండాలి.
  • ఆ తర్వాత వైద్య పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపాలి. కొద్దిరోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details