ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విజయనగరంలో అంబరాన్నంటిన భోగి సంబరాలు

By

Published : Jan 13, 2021, 1:32 PM IST

విజయనగరం జిల్లాలో భోగి మంటల సంబరాలు అంబరాన్నంటాయి. భోగి మంటలు వేసి, గంగిరెద్దుల ఆటలతో ప్రజలు సందడి చేశారు. దిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా కేంద్రం జారీ చేసిన రైతు చట్టాల ప్రతులను భోగి మంటల్లో తగలబెట్టారు.

bhogi grand celebration
అంబరాన్నంటిన భోగి సంబరాలు

అంబరాన్నంటిన భోగి సంబరాలు

విజయనగరం జిల్లా వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడవాడలా వేకువ జాము నుంచే భోగి మంటలతో ప్రజలు సందడి చేశారు. ముఖ్యంగా నగరంలో సామూహిక భోగి వేడుకలు అంబరాన్నంటాయి. కాలనీ వాసులందరూ ఒక చోటకు చేరి వేడుకల్లో పాల్గొన్నారు. పొంగళ్లు, చెరకు గడలతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రాంగణాలను అందంగా అలంకరించారు. యువతీ యువకులతో పాటు మహిళలు, పురుషులు, చిన్నారులందరూ సంప్రదాయ వస్త్రధారణతో సందడి చేశారు. అనంతరం భోగి మంటలు వేసి, గంగిరెద్దుల ఆటలతో సంబరాలు చేసుకున్నారు. దిల్లీలో రైతుల చేపట్టిన ఆందోళనకు మద్దతుగా రైతు, కార్మిక, ప్రజా సంఘాలు కలెక్టరేట్ వద్ద భోగిమంటలు వేసి, కేంద్రం జారీ చేసిన రైతు చట్టాల ప్రతులను తగులబెట్టారు.

పార్వతీపురంలో భోగి వేడుకలు..

పార్వతీపురంలో భోగి వేడుకలు ఘనంగా జరిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నోబుల్ వాకర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే అలజంగి జోగారావు హాజరై భోగిమంటలు వెలిగించారు. సంప్రదాయ దుస్తుల్లో వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. పట్టణంతో పాటు సీతానగరం, బలిజిపేట, పార్వతీపురం మండలాల్లో భోగి మంటలు వేసి పూజలు చేశారు. పిల్లలకు భోగి పళ్ళు పోసి భోగి ప్రాధాన్యతను వివరించారు. ఏడాదంతా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే జోగారావు ఆకాంక్షించారు.

ఇవీ చూడండి:

"అంటు వ్యాధులు ప్రబలకుండా... పారిశుద్ధ్యం పై దృష్టి సారించండి"

TAGGED:

ABOUT THE AUTHOR

...view details