ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కాగితాల్లో సరకు ఫుల్‌... గిడ్డంగిలో చూస్తే నిల్‌...

By

Published : Sep 26, 2019, 5:22 PM IST

ఓ శీతలగిడ్డంగి యజమాని కొంత మంది రైతుల పేరుతో వ్యవసాయ ఉత్పత్తులపై బ్యాంకునుంచి రుణం తీసుకొని ...ఎగ్గొట్టే ప్రయత్నం చేసిన ఘటన మేదరమెట్లలో చోటుచేసుకుంది.

cold warehouse owner cheated bank at medharametla in prakasham

ప్రకాశం జిల్లా మేదరమెట్లలో ఓ శీతలగిడ్డంగి యజమాని బ్యాంకు అధికారులనే మోసం చేశాడు ...రైతుమిత్ర శీతలగిడ్డంగి యజమాని పాండురంగరావు 2017లో మేదరమెట్ల ఇండియన్‌ బ్యాంక్‌ లో రూ.12 కోట్ల రుణం తీసుకున్నారు.. మిర్చి, శనగ పంటను తన గిడ్డంగిలో 54 మంది రైతులు నిల్వ ఉంచినట్లు చూపించి.. వాటిపై ఆయా రైతుల పేర్లమీద రుణం తీసుకున్నారు...రుణం చెల్లింపు విషయంలో దాటవేత ధోరిణితో ఉండటంతో బ్యాంకు అధికారులు శీతలగిడ్డంగిని పరిశీలిస్తే పంట ఉత్పత్తులు మాయమయ్యాయి. ఈ రైతులంతా గుంటూరు జిల్లా చిలకలూరి పేట ప్రాంతానికి చెందిన రైతులుగా గుర్తించారు. సంబంధిత రైతులు వివరాలు కూడా అధికారులకు లభించకపోవడంతో యజమాని మోసం గుర్తించారు..దీనిపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతుల పేర్లు బినామీగా పెట్టి రుణం తీసుకున్నారా? వాస్తవానికి రైతులు ఉన్నారా ? అనే విషయంపై 54 మంది రైతులమీదు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

రైతుల పేరుతో బ్యాంక్​కు టోకరా వేసినా..శీతలగిడ్డంగి యజమాని

ABOUT THE AUTHOR

...view details