ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'తప్పులతడకగా నెల్లూరు నగర ఓటర్ల జాబిత '

By

Published : Mar 19, 2021, 7:59 PM IST

నెల్లూరు కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా ఓటర్ల జాబితా రూపొందించారని సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఏ డివిజన్​లో ఎవరి ఓటు ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Nellore voter list
నెల్లూరు నగర ఓటర్ల జాబిత తప్పులతడక

నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రూపొందించిన ఓటర్ల జాబిత తప్పులతడకగా ఉందని సీపీఎం నాయకులు ఆరోపించారు. కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా ఓటర్ల జాబితా రూపొందించారని సీపీఎం నేత మాదాల వెంకటేశ్వర్లు విమర్శించారు. ఓ డివిజన్​లో ఓటర్ల సంఖ్య అధికంగా ఉంటే, మరో డివిజన్​లో తక్కువగా ఉందన్నారు. నగరంలో ఏ డివిజన్​లో ఎవరి ఓటు ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఓటర్ల జాబితాలో పొరపాట్లు సవరించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details