ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చంద్రబాబు పుట్టినరోజు.. నేతల సేవా కార్యక్రమాలు

By

Published : Apr 20, 2020, 1:04 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. కృష్ణాజిల్లా తిరువూరులో ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు.

tdp leaders doing social service on chandrababu birthday at tiruvuru krishna district
పేదలకు నిత్యావసరాలు పంచుతున్న తెదేపా నేతలు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా.. కృష్ణాజిల్లా తిరువూరులో పట్టణ తెదేపా కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. తిరువూరు తెదేపా కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచిపెట్టారు. ఒకటో వార్డులో తెదేపా కౌన్సిలర్ అభ్యర్థి మోదుగు వెంకటేశ్వరరావు ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. రాజుపేటలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ప్రజలకు బిర్యాని పొట్లాలు అందజేశారు. పురపాలక సంఘం కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. 7వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి పర్వతం శ్రీనివాసరావు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details