ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిమ్మమ్మ మర్రిమానును కాపాడుదాం... భావితరాలకు చూపిద్దాం!

By

Published : Dec 16, 2019, 10:06 PM IST

ప్రపంచ ప్రసిద్ధి చెంది, గిన్నిస్ బుక్ లో స్థానం పొందిన తిమ్మమ్మ మర్రిమాను సంరక్షణ కొరవడుతోంది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మహావృక్షం కొమ్మలు ఒక్కటొక్కటిగా ఎండిపోతున్నాయి. తిమ్మమాంబ ఆలయ ఆదాయం, గ్రామస్తులు ఇచ్చిన భూములపై చూపుతున్న శ్రద్ధ, చారిత్రక వారసత్వం కలిగిన తిమ్మమ్మ మర్రిమాను పై చూడడం లేదంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

timmamma marrimanu tree in ananthapuram district
'తిమ్మమ్మ మర్రిమానును కాపాడుదాం... భావితరాలకు చూపిద్దాం'

'తిమ్మమ్మ మర్రిమానును కాపాడుదాం... భావితరాలకు చూపిద్దాం'

అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం గూటి బయలు వద్ద సుమారు 6 ఎకరాలలో విస్తరించి ఉన్న తిమ్మమ్మ మర్రిమాను... ఇటీవల కాలంలో సంరక్షణ కొరవడి ఎండిపోతోంది. 6వందల ఏళ్లకు పైగా వయసు కలిగి... వారసత్వ సంపదగా భావిస్తున్న ఈ మహావృక్షం ఎండిపోవటం... తిమ్మమాంబ వంశస్థులతో పాటు స్థానికులను కలవరపెడుతోంది.

సేవ్ తిమ్మమ్మ మర్రిమాను...

తిమ్మమ్మ మర్రిమాను బాధ్యతను అటవీశాఖకు అప్పగించే వరకు... దిన దిన ప్రవర్ధమానం చెందిందని, అధికారులు సకాలంలో స్పందించని కారణంగా మర్రిమాను దెబ్బతింటోందని తిమ్మమాంబ వంశీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంరక్షణ చర్యలు చేపట్టాలంటూ స్థానిక యువత 'సేవ్ తిమ్మమ్మ మర్రిమాను' అంటూ నిరసన ప్రదర్శన చేపడుతోంది.

బాధ్యత అందరిది...

తిమ్మమ్మ మర్రిమాను సంరక్షణపై స్థానికుల ఆందోళన, అటవీశాఖ అధికారులు వ్యవహార తీరును తెలుసుకునేందుకు స్థానికులతో... జిల్లా అటవీ శాఖ అధికారి సమావేశమయ్యారు. సంరక్షణ చర్యలతో పాటు... ఆలయ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రిమాను సంరక్షణ... అటవీశాఖ అధికారులతో పాటు... స్థానికులకూ ఉందని అటవీ శాఖ జిల్లా అధికారి జగన్నాథ్ సింగ్ సూచించారు.భవిష్యత్ తరాలకు సైతం ఈ మహావృక్షాన్ని వారసత్వ సంపదగా అందించేందుకు అటు ప్రభుత్వం...ఇటు ప్రజలు కృషి చేయాలని స్థానికులు కోరారు.

ఇవీ చూడండి

ఒకేచోట 110 దేశాల అరుదైన కరెన్సీ

ABOUT THE AUTHOR

...view details