Warangal Twin Murders Latest Updates : ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని తన నుంచి వేరు చేశారన్న కోపంతోనే నిందితుడు జంట హత్యలకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్ తండాలో ఉన్మాదిగా మారి యువతి తల్లిదండ్రులను ఆ యువకుడు హత్య చేశాడు.
ప్రేమించిన యువతిని వేరు చేశారన్న కోపంతోనే వరంగల్ జంట హత్యలు
Published : Jul 12, 2024, 9:52 PM IST
Warangal Twin Murders Latest Updates (ETV Bharat)
నిందితుడు నెల రోజుల క్రితం నెక్కొండలో ఒక కత్తి కొనుగోలు చేశాడని, అలాగే అమెజాన్ షాపింగ్‌లో మరో కత్తి కొని జంట హత్యలు చేశాడని పోలీసులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా గూడురు మండలం గుండెంగ గ్రామానికి నిందితుడు ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో వారి ఇంట్లో వారు ఆ యువతిని తీసుకొని వెళ్లిపోవడంతో కక్ష కట్టుకుని ఆమె తల్లిదండ్రులను హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.