ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి బెదిరింపు కాల్స్
Published : May 29, 2024, 4:11 PM IST
Threatening phone calls to Goshamahal MLA Rajasingh: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మరోసారి చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. తనను చంపుతామంటూ గుర్తు తెలియని పలు నంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి బెదిరింపులకు గురికావడం ఇదేమి మొదటిసారి కాదని తెలిపారు. గతంలో బెదిరింపు కాల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని అయినా చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ బాధ్యతాయుతమైన పౌరుడిగా, ఈ పరిస్థితిని పోలీస్ శాఖకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు.