TG Police App Hacked issue :తెలంగాణ పోలీసులకు సంబంధించి మరో యాప్ హ్యాక్ అయినట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెలిశాయి. ఇటీవల 'హ్యాక్ ఐ' యాప్ సహా పలు వెబ్‌సైట్లు హ్యక్ అయినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఐటీసెల్ డీఎస్పీ రవిచంద్ర ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరుగుతున్న సమయంలో తాజాగా 'టీఎస్‌కాప్' యాప్ హ్యాక్ చేసినట్లు 'ఎక్స్'లో పోస్టులు వెలిశాయి. ఈ యాప్లో ఫేస్ మిర్రరింగ్ యాప్, ఏసీబీ, సీఐడీ సహా అన్ని విభాగాల డేటా ఉన్నట్లు సైబర్ నేరగాళ్లు పోస్టులు పెట్టారు.
టీజీ పోలీసుల యాప్ హ్యాక్ అయినట్లు 'ఎక్స్'లో పోస్టులు
TG Police App Hacked issue (ETV Bharat)
Published : Jun 7, 2024, 4:00 PM IST
2018లో ప్రారంభం అయిన 'టీఎస్‌కాప్' యాప్ పోలీసులు వారి డిపార్ట్మెంట్ వారీగా పలు కేసుల ఛేదనకు, పెట్రోలింగ్ వాహనాలు, ఇతర సేవలకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో 54కి పైగా పలు సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ యాప్ సహా ఇతర పోలీసు వెబ్‌సైట్లు కూడా పనిచేయకపోవడం గమనార్హం.