national

By ETV Bharat Telangana Team

Published : Jun 29, 2024, 7:25 PM IST

ETV Bharat / snippets

హైటెక్‌ సిటీ వద్ద నలుగురు డ్రగ్స్‌ వినియోగదారులు అరెస్ట్

Drug Users Gang arrest
TG NAB Arrested Drug Users Gang (ETV Bharat)

TG NAB Arrested Drug Users Gang :హైదరాబాద్ హైటెక్‌ సిటీ వద్ద నలుగురు డ్రగ్స్‌ వినియోగదారులను పట్టుకున్నామని నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య తెలిపారు. వీరి నుంచి ఒకటిన్నర కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో సచిన్‌, నవీన్ నాయక్‌, ప్రణీత్‌రెడ్డి, రాహుల్‌ ఉన్నారని వీరిపై మాదాపూర్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు వివరించారు. రాజా మరో నిందితుడు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.

అతడిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామన్నారు. నిందితులపై గతంలో కూడా కొన్ని కేసులున్నాయని వివరించారు. తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలని విద్యాసంస్థల్లో, హాస్టళ్లో తనిఖీలు నిర్వహించాలని సాయి చైతన్య సూచించారు. డ్రగ్స్‌ వ్యసనపరులను రిహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించి వారిలో మార్పు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details