national

ETV Bharat / snippets

గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికులకు రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియా

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

ExGratia Guidelines for Gulf Countries Workers
TG Govt on Ex Gratia Guidelines for Gulf Countries Workers (ETV Bharat)

TG Govt on ExGratia Guidelines for Gulf Countries Workers :గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికులకు ఎక్స్​గ్రేషియా చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు గల్ఫ్ మృతుల కుటంబ సభ్యులకు రూ.5 లక్షలు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుంది. బహ్రెయిన్, కువైట్, ఇరాక్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో 2023 డిసెంబరు 7 తర్వాత మరణించిన కార్మికులకు ఎక్స్​గ్రేషియా వర్తిస్తుందని మార్గదర్శకాల్లో సీఎస్ శాంతికుమారి వెల్లడించారు.

కార్మికులు మృతి చెందిన ఆరు నెలల్లో భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్​కు దరఖాస్తు సమర్పించాలని సీఎస్ శాంతికుమారి తెలిపారు. మరణ ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్టు, బ్యాంకు ఖాతా తదితర వివరాలతో దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. ఆర్థిక సాయం రూ.5 లక్షలు నేరుగా బ్యాంకులో జమ చేయనున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details