ETV Bharat / state

గర్భవతులకు రూ.30 వేలు అందిస్తోన్న ప్రభుత్వం - వారికి మాత్రమే ఛాన్స్ - ఇలా అప్లై చేసుకోండి!

భవన నిర్మాణ రంగంలో పనిచేసే మహిళా కార్మికులకు గుడ్​న్యూస్. ప్రెగ్నెన్సీ టైమ్​లో అయ్యే ఖర్చులకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. మెటర్నిటీ బెనిఫిట్ కింద కొంత డబ్బును అందిస్తోంది. ఆ వివరాలు మీకోసం..

author img

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

TELANGANA MATERNITY BENEFIT SCHEME
Maternity Benefit Scheme (ETV Bharat)

Maternity Benefit Scheme in Telangana : నేటి రోజుల్లో అన్ని ఖర్చులూ విపరీతంగా పెరిగిపోయాయి. ఇక ఆరోగ్య సమస్య తలెత్తితే ఎంత ఖర్చవుతుందో ఎవ్వరికీ తెలియదు. రోజువారీ కూలీ పనులు చేసుకునే వారికి మోయలేని భారం అవుతుంది. అందుకే.. భవన నిర్మాణ రంగ కార్మికులకు చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం.. మెటర్నిటీ బెనిఫిట్ పేరిట ఓ స్కీమ్​ని ప్రవేశపెట్టింది.

తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి, కార్మిక సంక్షేమ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ కింద కార్మికురాలు లేదా కార్మికుల కుటుంబంలో మహిళల డెలివరీ ఖర్చుల నిమిత్తం రూ.30,000 వరకు ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. మరి.. ఇందుకు ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్మికురాలి అర్హతలు :

  • ఈ స్కీమ్​కి అప్లై చేసుకునే మహిళా భవన నిర్మాణ కార్మికురాలు అయి ఉండాలి.
  • అలాగే.. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యురాలై ఉండాలి. అంటే.. ప్రభుత్వం కార్మికులకు జారీ చేసే లేబర్ కార్డును(Labour Card) కలిగి ఉండాలి.
  • నిర్మాణ కార్మికురాలు డెలివరీ తేదీకి కనీసం 12 నెలల ముందు కార్మికుల సంక్షేమ మండలిలో సభ్యత్వం పొంది ఉండాలి.
  • అర్హులైన మహిళా కార్మికులు ఈ స్కీమ్ కింద అందే సహాయాన్ని రెండు డెలివరీలకు మాత్రమే పొందుతారు.

కార్మికుల భార్య/కుమార్తెల కోసం :

  • భవన నిర్మాణ కార్మికులు తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో రిజిస్ట్రేషన్ పొంది ఉండాలి.
  • ఒక కార్మికుడు ఇద్దరు కుమార్తెల వరకు రెండుసార్లు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలను పొందడానికి అర్హులు.
  • అలాగే.. నిర్మాణ కార్మికుడు మహిళల డెలివరీ తేదీకి కనీసం ఏడాది ముందు కార్మికుల సంక్షేమ బోర్డులో రిజిస్టర్ చేసుకొని ఉండాలి.
  • ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరూ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో రిజిస్టర్డ్ వర్కర్లైతే.. అప్పుడు కుమార్తెల కోసం ఒకరు మాత్రమే స్కీమ్ మొత్తానికి అర్హులు.

అమ్మాయి పెళ్లికి ప్రభుత్వ కానుక - కానీ వారికి మాత్రమే ఛాన్స్! - ఇలా అప్లై చేసుకోండి!

అప్లై చేయడానికి అవసరమైన పత్రాలు :

  • దరఖాస్తుదారు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
  • భవన నిర్మాణ కార్మికుడి/కార్మికురాలి రిజిస్ట్రేషన్ కార్డ్
  • రెన్యూవల్ చలాన్ కాపీ
  • డెలివరీ సర్టిఫికెట్ (పీహెచ్​సీ/లోకల్ ఏరియా హాస్పిటల్ లేదా ప్రైవేట్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ జారీ చేసిన ధ్రువపత్రం)
  • ఒకవేళ ఇంటి దగ్గర డెలివరీ అయినట్లయితే ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీ జారీ చేసిన ప్రీ-హోమ్ డెలివరీ సర్టిఫికెట్
  • పిల్లల బర్త్ సర్టిఫికెట్(Birth Certificate)
  • అడ్వాన్స్ స్టాంపెడ్ రశీదు
  • బ్యాంక్ పాస్​బుక్ కాపీ

దరఖాస్తు విధానం :

  • అర్హులైన భవన నిర్మాణ కార్మికులు ఈ స్కీమ్ అందే బెనిఫిట్స్ పొందాలంటే ఆఫ్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • అందుకోసం అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లి అందులో డౌన్​లోడ్స్​లో "Maternity Benefit"పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు అక్కడ కనిపించే అప్లికేషన్ ఫామ్​ను డౌన్​లోడ్ చేసి ప్రింట్ చేసుకోవాలి. లేదా కార్మికశాఖ కార్యాలయంలో తీసుకోవచ్చు.
  • ఆ ఫామ్​ని తీసుకున్నాక అందులో పేర్కొన్న వివరాలన్నీ కరెక్ట్​గా నమోదు చేయాలి. ఆపై అవసరమైన పత్రాల కాపీలను అప్లికేషన్​ ఫామ్​కి జత చేయాలి.
  • అనంతరం ఫామ్​పై సంతకం చేసి కార్మిక శాఖలోని సంబంధిత అధికారికి సబ్మిట్ చేయాలి.
  • అప్లికేషన్ ఇచ్చాక దరఖాస్తు చేసినట్టుగా మీరు సంబంధిత అధికారి నుంచి ఒక రిసిప్ట్ తీసుకోవాలి.
  • అలాగే.. ఇచ్చిన రిసిప్ట్​పై సమర్పించిన తేదీ, సమయంతో పాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా? అని ఓసారి చెక్ చేసుకోవాలి.
  • దరఖాస్తు తర్వాత.. సంబంధిత అధికారులు విచారణ జరిపి అర్హులైన కార్మికుల బ్యాంక్ అకౌంట్​లోకి నేరుగా ఆర్థిక సాయం జమ చేస్తారు.

Note : ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. డెలివరీ తేదీ నుంచి ఒక సంవత్సరంలోపు దరఖాస్తులను సమర్పించాలి.

చాలామందికి తెలియదు - కార్మికుడు మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.