national

ETV Bharat / snippets

బీ అలర్ట్ - రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

Telangana Forecast Report Today
TELANGANA FORECAST REPORT (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jun 15, 2024, 5:31 PM IST

Telangana Forecast Report Today: రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఉన్న ద్రోణి ఇవాళ అదే ప్రాంతంలో కొనసాగుతుందని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details