Rs 7 Crores Recovered From Cyber Criminals in Telangana :రాష్ట్రంలోని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్‌బీ)మరో ఘనత సాధించింది. సైబర్ వలలో చిక్కుకుని డబ్బు పోగొట్టుకున్న బాధితులకు కేవలం ఒక్క రోజులోనే రూ.7.9 కోట్లు ఇప్పించి రికార్డు సృష్టించింది. ఈ నెల 8న జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో 2,973 కేసులకు సంబంధించిన బాధితులకు ఈ మొత్తం సొమ్మును ఇప్పించగలిగింది.
టీజీసీఎస్‌బీ మరో ఘనత - సైబర్ నేరాల బాధితులకు ఒక్కరోజే రూ.7.9 కోట్ల అప్పగింత
Rs 7.9 Crore Refund From Cyber Crime in Telangana (ETV Bharat)
Published : Jun 10, 2024, 10:01 AM IST
తెలంగాణ ప్రభుత్వ న్యాయ సేవాధికార సమితి(టీజీఎల్‌ఎస్‌ఏ) సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసింది. ఆ ఒక్కరోజే మొత్తం 4,144 కేసులు న్యాయస్థానంలో నమోదవగా ఇంకా 1,171 కేసులను పరిష్కరించాల్సి ఉంది. వాటిని కూడా త్వరలోనే పరిష్కరించనున్నారు. గత మార్చిలోనూ ఇదే రీతిలో లోక్ అదాలత్‌లో నమోదైన 803 కేసుల్లో ఒక్క రోజే టీజీసీఎస్‌బీ రూ.3.66 కోట్లను ఇప్పించి బాధితులకు అండగా నిలిచింది.