national

ETV Bharat / snippets

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం - 24 గంటల్లో తీవ్ర తుఫాన్ : విశాఖ వాతావరణ శాఖ

Rain Alert in Andhra Pradesh
Rain Alert in Andhra Pradesh (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 24, 2024, 8:11 AM IST

Updated : May 24, 2024, 2:05 PM IST

Rain Alert in Andhra Pradesh :పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల్లో తుఫానుగా మారి అనంతరం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుపానుకు 'రేమాల్'గా నామకరణం చేసినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద తెలిపారు. తుఫాను ఈశాన్య దిశగా కదిలి బంగ్లాదేశ్ తీరంలో 27వతేదీ అర్ధరాత్రి దాటాక తీరం దాటే అవకాశముందని వెల్లడించారు. ఒడిశా, బంగాల్, బంగ్లాదేశ్ పై తుఫాన్ ప్రభావం చూపుతుందని తెలిపారు. మధ్య బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వెళ్లవద్దని హెచ్చరించారు. పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు సునంద తెలిపారు. ఈ రేమాల్ తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉండదని అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయన్నారు. తుఫాన్ ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరించినట్లు వెల్లడించారు.

Last Updated : May 24, 2024, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details