national

By ETV Bharat Telangana Team

Published : Sep 6, 2024, 11:58 AM IST

ETV Bharat / snippets

25 రోజుల్లో రూ.2 కోట్ల విలువైన మొబైల్​ ఫోన్లు - రికవరీ చేసిన రాచకొండ పోలీసులు

CP Sudheer Babu
Rachakonda Police Cellphones Handed over to the victims (ETV Bharat)

Rachakonda Police Recovred Stolen Phones : చోరీకి గురైన సెల్‌ఫోన్లను రాచకొండ పోలీసులు బాధితులకు అందజేశారు. కమిషనరేట్‌ పరిధిలో జోన్లవారీగా మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, 25 రోజుల వ్యవధిలో రూ.2 కోట్ల విలువైన 591 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సీఈఐఆర్‌ (సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌) పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ ఫోన్లను రికవరీ చేశారు.

ఇటీవలి కాలంలో సెల్‌ఫోన్ల దొంగతనం ఘటనలు భారీగా జరుగుతున్నాయని సీపీ సుధీర్​ బాబు తెలిపారు. ఇలాంటి ఫోన్లను ఛేజిక్కించుకుంటున్న కొందరు వేర్వేరు అవసరాలకు వాడుతున్నారన్నారు. ఫోన్‌ పోగొట్టుకున్న వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. వెంటనే పోలీసులు సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి ట్రాక్‌ చేస్తారని సీపీ తెలిపారు. ఫోన్ల రికవరీలో రాష్ట్రంలో హైదరాబాద్‌ కమిషనరేట్‌ ప్రథమ స్థానంలో ఉండగా, రాచకొండ రెండో స్థానంలో ఉందని సీపీ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details