national

ETV Bharat / snippets

పోలీసు కస్టడీకి నందిగం సురేష్‌ - శని, ఆదివారాల్లో విచారణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2024, 8:24 PM IST

nandigam_suresh_in_police_custody_in_woman_murder_case
nandigam_suresh_in_police_custody_in_woman_murder_case (ETV Bharat)

Nandigam Suresh In Police Custody in Woman Murder Case :వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. వెలగపూడి మహిళ హత్య కేసులో నిందితుడైన నందిగం సురేష్ ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నందిగం సురేష్‌ను కస్టడీకి ఇవ్వాలని మంగళగిరి గ్రామీణ పోలీసులు కోరగా రెండు రోజుల పాటు అనుమతిస్తూ కోర్టు నిర్ణయం వెల్లడించింది. ఈ మేరకు శని, ఆదివారాల్లో మంగళగిరి పోలీసులు సురేష్‌ను విచారించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details