national

ETV Bharat / snippets

నందిగం సురేష్‌కు అస్వస్థత - ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యుల నివేదిక

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 11, 2024, 4:55 PM IST

Nandigam_Suresh
Nandigam Suresh (ETV Bharat)

Nandigam Suresh Health Updates: మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత నందిగం సురేష్​ను వైద్య పరీక్షల అనంతరం తిరిగి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఉదయం భుజం నొప్పి, ఛాతి నొప్పితో అస్వస్థతకు గురికాగా, జైలు అధికారులు నందిగం సురేష్​ను జీజీహెచ్​కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు నందిగం సురేష్​కు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో నందిగం సురేష్ ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు నివేదిక ఇచ్చారు. వైద్యుల సూచన మేరకు నందిగం సురేష్​ను తిరిగి జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. వెలగపూడి దళిత మహిళ మరియమ్మ మృతి కేసులో పీటీ వారెంట్ ఇవ్వగా, కోర్టు 14 రోజులు నందిగం సురేష్​కు రిమాండ్ విధించింది.

ABOUT THE AUTHOR

...view details