national

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2024, 8:05 AM IST

ETV Bharat / snippets

ఇవాళ మాజీ సీఎం కేసీఆర్​ను కలవనున్న ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha To meet KCR
MLC Kavitha To meet KCR (ETV Bharat)

MLC Kavitha To Meet KCR Today :సుప్రీంకోర్టు బెయిల్‌తో జైలు నుంచి విడుదలై హైదరాబాద్ వచ్చిన బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత ఇవాళ (ఆగస్టు 29) తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. దిల్లీ నుంచి బుధవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన కవిత గులాబీ శ్రేణుల ఘన స్వాగతం మధ్య బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇంట్లో తల్లి శోభమ్మకు పాదాభివందనం చేసిన సమయంలో ఇరువురూ భావోద్వేగానికి లోనయ్యారు.

కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన కవిత అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో మరింత బలంగా పోరాడతానని చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం తన తండ్రి కేసీఆర్‌ను కవిత కలవనున్నారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్నారు. ఐదు నెలల విరామం అనంతరం కవిత తన తండ్రిని కలవబోతున్నారు. మార్చ్ 15న అరెస్ట్ అయిన సందర్భంలోనూ కేసీఆర్ కవితను కలవలేదు.

ABOUT THE AUTHOR

...view details