national

ETV Bharat / snippets

మిర్యాలగూడ సీఐపై అవినీతి ఆరోపణలు - ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు

CI Attached to The IG office
Miryalaguda Police Station (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 10:59 AM IST

Miryalguda CI Attached to The IG office: నల్గొండ జిల్లా మిర్యాలగూడ వన్​టౌన్​ సీఐగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్​ను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎస్పీ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల నగదు వసూళ్లతో పాటు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్లు తరచు ఫిర్యాదులు రావడంతో సీఐ సుధాకర్ పై శాఖ పరమైన విచారణ చేపట్టారు. అనంతరం అతనిపై పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. పోలీసు సిబ్బంది, అధికారులు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడిన కఠినమైన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ శరత్​చంద్ర పవార్ హెచ్చరించారు. పోలీసులు ఎవరినైనా కావాలని ఇబ్బంది పెట్టినా, డబ్బులు డిమాండ్ చేసినా వారిపై ఫిర్యాదు చేయవచ్చని ప్రజలకు సూచించారు. పోలీసులు సివిల్ కేసులలో తలదూర్చవద్దని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details