national

పెట్రోల్​బంకు సిబ్బందిని స్వైపింగ్​మిషన్లతో మోసగిస్తున్న ముఠా అరెస్టు

By ETV Bharat Telangana Team

Published : Aug 3, 2024, 2:39 PM IST

Cyber Criminal Gang Arrest
Cyber Criminal Gang Arrest (ETV Bharat)

Cyber Criminal Gang Arrest :పెట్రోల్​బంకు సిబ్బందిని టార్గెట్​గా చేసుకుని స్వైపింగ్​ మిషన్​లోని ఆప్షన్​లను ఉపయోగించి సైబర్​ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టైంది. ఈ మేరకు ఐదుగురు అంతర్రాష్ట నిందితులను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,80,000ల నగదు, ఒక బైక్, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన ఐదుగురు వ్యక్తులు గతంలో పెట్రోల్​ బంకులో పనిచేసేవారు. ఆ క్రమంలోనే స్వైపింగ్​ మిషన్లపై అవగాహన పెంచుకున్నారు. హాస్పిటల్​ ఖర్చుల కోసం అత్యవసరంగా డబ్బు కావాలంటూ పెట్రోల్​ బంకుల వద్ద క్రెడిట్​కార్డు స్వైపింగ్ చేసి కావాల్సిన డబ్బు తీసుకుని వారిని మాటల్లో పెడుతున్నారు. ఈ క్రమంలోనే void"అనే ఆప్షన్ ద్వారా తిరిగి తమ ఖాతాల్లోకి వేసుకుని డబ్బు కాజేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ముఠా పలు ప్రాంతాల్లో సైబర్​నేరాలకు పాల్పడింది.

ABOUT THE AUTHOR

...view details