national

ETV Bharat / snippets

మరదలిపై అత్యాచారం - భర్త చేస్తున్న ఘోరాన్ని వీడియో తీసిన భార్య

By ETV Bharat Telangana Team

Published : Jul 7, 2024, 1:51 PM IST

Mardal Allegedly Raped By Brother In Law
Mardal Allegedly Raped By Brother In Law in Siddipet (ETV Bharat)

Man Rapes His Brother's Wife in Siddipet : సొంత తమ్ముడి భార్యపైనే కన్నేసిన ఒక అన్న, తన భార్య సాయంతో మరదలిపై అత్యాచారం చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన ఒక కామాంధుడు తన సొంత తమ్ముడి భార్యపై కన్నేశాడు. తమ్ముడికి వివాహం జరిగి నాలుగేళ్లు గడుస్తున్నా వారికి పిల్లలు పుట్టలేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న కామాంధుడు కోరిక తీర్చాలని తన భార్య సాయంతో మరదలిని భయపెట్టి అత్యాచారం చేశాడు.

ఈ ఘటనను భార్య సాయంతో వీడియో తీసి బెదిరించాడు. బావ, అతని భార్య వేధింపులు భరించలేక ఆ మహిళ తన తల్లి, బంధువుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బావతో పాటు తోడికోడలుపై అత్యాచారం కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్‌ చేసి రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details