national

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

ETV Bharat / snippets

'గోల్కొండ, చార్మినార్​లోనూ నాకు వాటాలున్నాయనేటట్లున్నారు' : ఎంపీ అనిల్​కు హరీశ్​రావు కౌంటర్

Harish Rao Fires on MP Anil Kumar Yadav
Harish Rao Fires on MP Anil Kumar Yadav (ETV Bharat)

Harish Rao Fires on MP Anil Kumar Yadav : ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనపై బురదజల్లే వికృత రాజకీయాలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరలేపుతోందని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పక్కను మళ్లించడానికి గోబెల్స్‌ ప్రచారాన్ని ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఎలా ఉందంటే గోల్కొండ కోట, చార్మినార్‌లో కూడా హరీశ్​రావుకు వాటాలు ఉన్నాయనేట్లుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. అబద్దపు ప్రచారాలు చేస్తున్నందుకు లీగల్ నోటీస్ పంపుతున్నట్లు తెలిపారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్‌ను ట్విటర్ వేదికగా హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details