national

తెలంగాణలో గల్ఫ్​ బోర్డు ఏర్పాటు చేయాలి - సీఎం రేవంత్​కు గల్ఫ్​ కార్మిక సంఘాల ప్రతినిధుల వినతి

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 8:11 PM IST

Gulf Trade Unions to Form Gulf Board
Gulf Trade Unions to Form Gulf Board (ETV Bharat)

Gulf Trade Unions to Form Gulf Board : గల్ఫ్​ తదితర దేశాల్లోని వలస కార్మికుల సంక్షేమం కోసం గల్ఫ్​ బోర్డు ఏర్పాటు చేయాలని గల్ఫ్​ కార్మిక సంఘాల ప్రతినిధులు సీఎం రేవంత్​ రెడ్డిని కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలో సీఎం రేవంత్​కు ఆ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం సమర్పించారు. గల్ఫ్​ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్​గ్రేషియో చెల్లింపుకు స్పష్టమైన జీవో జారీ చేయాలన్నారు. ఎన్నారై పాలసీ ప్రవేశపెట్టడంతో పాటు రూ.500 కోట్ల నిధులు విడుదల చేయాలని విన్నవించారు. ఈ మేరకు సీఎం సానుకూలంగా స్పందించారు. చొప్పదండి శాసనసభ్యుడు మేడిపల్లి సత్యం చొరవతో ముఖ్యమంత్రితో జరిగిన భేటీలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి సీఎం అపాయింట్​మెంట్​కు సహకరించారు.

ABOUT THE AUTHOR

...view details