national

ETV Bharat / snippets

నెలలు నిండకుండా పుట్టింది - పాఠశాల హాజరులో రికార్డులే రికార్డులు!

Girl Records In School Attendance
Girl Records In School Attendance (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 3:27 PM IST

Girl Records In School Attendance : పిల్లలు ఆరోగ్యం బాగున్నా.. ఏదోక కారణంతో అప్పుడప్పుడూ స్కూలు ఎగ్గొడుతుంటారు. కానీ, ఐదున్నర నెలలకే పుట్టి మూడున్నరేళ్ల వరకు ట్రీట్​మెంట్​ తీసుకున్న అయత్‌ ఇశ్రాయెల్‌ జిబ్రిల్‌(7) మాత్రం స్కూల్​ హాజరులో రికార్డులు సృష్టిస్తోంది. పల్నాడుజిల్లా సత్తెనపల్లికి చెందిన మస్తాన్‌వలి కారు డ్రైవర్‌. ఆయన కేరళకు చెందిన షీబాను వివాహం చేసుకున్నాడు. వీరికి 2017లో ఐదో నెలలోనే అయత్‌ జన్మించింది. పాప 500 గ్రాములే ఉండటం, అవయవాలు పూర్తిగా రూపుదాల్చక పోవడం, శరీరమంతా వెంట్రుకలతో జన్మించింది. దాదాపు రూ.25లక్షలు ఖర్చుచేసి వైద్య పరికరాల సాయంతో ప్రత్యేకగదిలో మూడున్నరేళ్లు చికిత్స చేశారు. ప్రస్తుతం కేరళలో చదువుతోన్న పాప.. 2023-24లో 197రోజులు తరగతులు నిర్వహించగా అన్నిరోజులూ హాజరైంది. దీంతో.. అమెరికా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌(యూకే), ఇంటర్నేషనల్‌ వరల్డ్‌ బుక్‌ఆఫ్‌ రికార్డ్స్, ఇండియా బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

ABOUT THE AUTHOR

...view details