national

ETV Bharat / snippets

రాజ్యసభ ఎంపీ అనిల్​ కుమార్​కు హరీశ్​రావు లీగల్​ నోటీసులు

MP ANIL KUMAR YADAV
HARISH RAO LEGAL NOTICE (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2024, 12:43 PM IST

Harish Rao Legal Notices to Rajya Sabha MP Anil Kumar : బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్‌ యాదవ్​కు లీగల్ నోటీసులు పంపించారు. తనపై చేసినవి తప్పుడు ఆరోపణలని హరీశ్ రావు అన్నారు. తనపై చేసిన నిరాధార ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి బీఆర్​ఎస్​ నేత దాసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు.

పెద్దల సభకు వెళ్లినా కూడా ఎంపీ అనిల్‌కుమార్​కు చిన్న పిల్లోడి చేష్టలు పోలేదని అన్నారు. రేవంత్‌ రెడ్డి డైరెక్షన్‌లో నిరాధార ఆరోపణలు, నిందలు వేస్తూ ప్రజా ప్రతినిధుల ప్రతిష్టను దిగజార్చడం శోచనీయమన్నారు. ఆధారాలతో మాట్లాడాలి కానీ, అడ్డగోలుగా మాట్లాడటం దిగజారుడు రాజకీయమే అవుతుందని అన్నారు. ఇలాంటి నాయకులకు తప్పకుండా బుద్ధి చెప్పేందుకే హరీశ్‌రావు లీగల్ నోటీసులు ఇస్తున్నారన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి గురించి ఆలోచించే హరీశ్‌రావుపై నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు.

ABOUT THE AUTHOR

...view details