national

By ETV Bharat Telangana Team

Published : Jun 24, 2024, 12:54 PM IST

ETV Bharat / snippets

రైల్వే వంతెన పైనుంచి దూకి - ఇంజినీరింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Student Suicide Attempt
Student Suicide Attempt in Hyderabad (ETV Bharat)

Student Suicide Attempt in Hyderabad :ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జనగామ జిల్లా దేవరుప్పులకు చెందిన ఓ యువతి ఘట్‌కేసర్‌లోని ఓ ప్రైవేటు వసతి గృహంలో ఉంటూ ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం చదువుతుంది.

హైదరాబాద్‌ - వరంగల్‌ జాతీయ రహదారి ఎన్‌ఎఫ్‌సీ నగర్‌ రైల్వే వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్థానికులు ఆమెను ఘట్‌కేసర్‌లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details