వీధికుక్కల స్వైరవిహారం - బాలుడి పురుషాంగంపై దాడి
Published : Aug 9, 2024, 1:40 PM IST
Stray Dog Attack On A Boy in Kokapet : ఓ బాలుడిపై వీధికుక్క దాడి చేసిన ఘటన హైదరాబాద్ నగర శివారులో చోటుచేసుకుంది. కోకాపేట సబితా నగర్లో గుడిసెలో పడుకున్న 7 సంవత్సరాల దివ్యాంగ బాలుడి పురుషాంగంపై దాడి చేసింది. ఒక్కసారిగా బాలుడు కేకలు వేయడంతో పిల్లవాడి తల్లి, స్థానికులు గుడిసెలోనికి చేరుకుని కుక్కను తరిమికొట్టారు. బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పసివాడిని ఆ పరిస్థితుల్లో చూసిన తల్లితండ్రులు తల్లడిల్లిపోతున్నారు.