national

By ETV Bharat Telangana Team

Published : Jun 5, 2024, 3:15 PM IST

ETV Bharat / snippets

మేడిగడ్డ బ్యారేజీలో సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ సంస్థ పరీక్షలు - మెటీరియల్, మట్టి నమునాలు సేకరణ

Medigadda Barrage Repairs Works
CSMRS Team Inspected Medigadda Barrage (ETV Bharat)

CSMRS Team Inspected Medigadda Barrage :కాళేశ్వరం ప్రాజెక్ట్​లోని మేడిగడ్డ బ్యారేజీలో సెంట్రల్ సాయిల్ మెటీరియర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం పరీక్షలను ప్రారంభించింది. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు ఏ ఏ పరీక్షలు నిర్వహించాలో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకోవడానికి దిల్లీకి చెందిన సీఎస్ఎంఆర్ఎస్ సంస్థతో పరీక్షలు చేయించాలని సూచన చేసింది. ఈ మేరకు ఆ సంస్థ మేడిగడ్డ బ్యారేజీకి చేరుకొని పరీక్షలు ప్రారంభించింది.

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్, మట్టి నమునాలను సేకరిస్తుంది. బ్యారేజీ కుంగిన పియర్ల ప్రాంతంలో 12, 13 పియర్ల వద్ద 25 ఫీట్ల మేర డ్రిల్ చేసి పరీక్షలు నిర్వహిస్తుంది. భూ భౌతిక పరీక్షలను సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. ఈ బృందం మూడు రోజుల వరకు పరీక్షలు చేపట్టనుంది.

ABOUT THE AUTHOR

...view details