ETV Bharat / snippets

యాదాద్రి స్వర్ణతాపడం ఆకృతి ఖరారు - డిజైన్ మీరూ చూడండి

author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Yadadri Swarnatapam Format Finalized
Yadadri Swarnatapam Format Finalized (ETV Bharat)

Yadadri Swarnatapadm Format Finalized : శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ విమాన గోపురాన్ని స్వర్ణమయం చేసే పనులను అధికారులు వేగవంతం చేశారు. అందులో భాగంగా కీలకమైన స్వర్ణమయ ఆకృతిని ఖరారు చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. యాదాద్రి స్వర్ణతాపడ పనులపై ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. ఆకృతి ఖరారుతో త్వరలోనే పనులు మొదలు కానున్నాయి.

తొలుత స్వర్ణతాపడాన్ని 127 కిలోల పుత్తడితో చేయాలని నిర్ణయించినా వివిధ కారణాలతో దాన్ని 65 కిలోలకు తగ్గించారు. ఇందుకోసం ఇప్పటికే దేవస్థానం వివిధ వర్గాల నుంచి విరాళాలు సేకరిస్తోంది. ఇప్పటి వరకు 11 కిలోల బంగారంతో పాటు రూ.20 కోట్ల నగదు సమకూరినట్లు సమాచారం. ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో విరాళాల ద్వారా వచ్చిన నగదుతో బంగారం కొనుగోలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఒకంట్రెండు రోజుల్లో వివరాలు తెలియనున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.