65 years old man Sexual Assault Minor Girl : అభంశుభం తెలియని 12 ఏళ్ల బాలికను ఓ వృద్ధుడు గర్భవతిని చేసిన ఉదంతం వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఎనిమిదో తరగతి చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సాంబయ్య(65) అనే వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి కొంతకాలంగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. బాలిక ఆరోగ్య పరిస్థితిని గమనించిన తల్లి నిలదీయగా విషయం తెలిపింది. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు బాలికకు వైద్య పరీక్షలు చేయించారు. ఆ విద్యార్థిని 4 నెలల గర్భిణిగా నిర్ధారించారు. దీంతో సాంబయ్యను అదుపులోకి తీసుకుని అతడిపై పోక్సో కేసును నమోదు చేశారు.
మైనర్ బాలికపై 65 ఏళ్ల వృద్ధుడి లైంగికదాడి - పోక్సోకేసు నమోదు
Published : 2 hours ago