national

ETV Bharat / snippets

2036 ఒలింపిక్స్ దృష్టిలో ఉంచుకుని క్రీడా పాలసీ సిద్ధం చేయాలి : సీఎం రేవంత్​

By ETV Bharat Telangana Team

Published : 6 hours ago

CM Revanth On Sports University in Telangana
CM Revanth On Sports Policy (ETV Bharat)

CM Revanth On Sports : గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా వ్యాయామ విద్య, క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ కూడా నెలకొల్పనున్నట్లు సీఎం చెప్పారు. సచివాలయంలో క్రీడా పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. హైదరాబాద్ లోని ప్రధాన స్టేడియాలన్నింటినీ ఒకే హబ్​గా తీర్చిదిద్దాలని సీఎం చెప్పారు. స్కిల్ యూనివర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. పతకాలు సాధించే క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2036 ఒలింపిక్స్​ను దృష్టిలో పెట్టుకొని కొత్త క్రీడా పాలసీని సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి, కేశవరావు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details