By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 16, 2024, 4:08 PM IST
కెనడీ లూగర్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమానికి ఏపీ విద్యార్థి- సీఎం చేయూత
CM Helped to Students Selected to Participate in Kennedy Lugar Youth Exchange Program :ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ఓ విద్యార్థి నిరూపించారు. చిన్ననాటి నుంచి చదువులో మెరిట్ సాధించిన తనను విదేశీ విద్య వరించింది. అమెరికాలో నిర్వహించే కెనడీ లూగర్ యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సూర్యతేజశ్రీ అర్హత సాధించారు. విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్ రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరిని తమ కార్యాలయానికి పిలిచి అభినందించారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ తోడ్పాటును ఇస్తుందని భరోసానిచ్చారు.