ETV Bharat / state

శ్రీవారి సేవలో అనునిత్యం తరిస్తున్న పూలదండలు - వీటి పేర్లు, కొలతలు తెలుసా? - Lord Venkateswara Swamy garlands - LORD VENKATESWARA SWAMY GARLANDS

TIRUMALA VENKATESWARA SWAMY GARLANDS: తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామి అలంకార ప్రియుడు. నిత్యం స్వామివారిని వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. అయితే స్వామి వారి సేవలో అనునిత్యం తరిస్తున్న పూలదండలకు పలు పేర్లు ఉన్నాయి. వాటిని తయారు చేయడానికి కొన్ని కొలతలు, నియమాలు పాటిస్తారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Venkateswara Swamy Garlands
Lord Venkateswara Swamy Garlands (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 29, 2024, 5:31 AM IST

LORD VENKATESWARA SWAMY GARLANDS: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వస్వామి పుష్పాలంకార ప్రియుడు. శ్రీనివాసునికి చేసే అనేక సేవలలో పుష్పకైంకర్యం అత్యంత ప్రియమైనదని. పవిత్రమైన కార్యమని ”తిరువాయ్‌ మొళి” అనే ప్రాచీన తమిళ గ్రంథంలో కూడా పేర్కొన్నారు. స్వామివారి ఆపాదమస్తకం వివిధ రకాల సుగంధ భరిత కుసుమాలతో సర్వాంగ సుందరంగా అలంకరించే ఈ పుష్పహారాల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1.⁠ ⁠శిఖామణి: కిరీటం మీదనుంచి రెండు భుజాల మీది వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను ‘శిఖామణి’ అంటారు. ఇది ఎనిమిది మూరల దండ.

2.⁠ ⁠సాలిగ్రామ మాల: శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూవున్న సాలగ్రామాల మాలలకు ఆనుకొని వేలాడదీస్తూ అలంకరింపబడే పొడవైన పూలమాలలు. ఇవి రెండుమాలలు. ఒక్కొక్కటి సుమారు 4 మూరలు.

3.⁠ ⁠కంఠసరి: శ్రీవారి మెడలో రెండు భుజాల మీదికి అలంకరించే దండ ఒకటి మూడున్నర మూరలు.

4.⁠ ⁠వక్షస్థల లక్ష్మీ: శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు రెండుదండలు, ఒక్కొక్కటి ఒకటిన్నర మూర.

5.⁠ ⁠శంఖుచక్రం: శంఖుచక్రాలకు రెండు దండలు. ఒక్కొక్కటి ఒక మూర.

6.⁠ ⁠కఠారిసరం: శ్రీస్వామివారి బొడ్డునవున్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఒకటి. రెండు మూరలు.

7.⁠ ⁠తావళములు: రెండు మోచేతులకింద, నడుము నుంచి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ల నుంచి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే మూడు దండలు. అందులో మొదటిది మూడు మూరలు, రెండోది మూడున్నర మూరలు, మూడోది నాలుగు మూరలు.

8.⁠ ⁠తిరువడి దండలు: స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు. ఒక్కొక్కటి ఒక్క మూర.

ప్రతి గురువారం జరిగే ”పూలంగి సేవ”లో మాత్రమే శ్రీస్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి, పై పేర్కొన్న మాలలతో పాటు నిలువెల్ల స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు.

Lord Venkateswara Swamy Garlands
Lord Venkateswara Swamy Garlands (ETV Bharat)

తిరుమల ప్రసాదం వడ నుంచి లడ్డూగా ఎలా మారిందంటే? - శ్రీవారికి ఎన్ని నైవేద్యాలు పెడతారో తెలుసా? - Tirumala Laddu History in Telugu

ఇవిగాక శ్రీవారి ఆనందనిలయంలోని వివిధ ఉత్సవమూర్తులకు ఈ కింది విధంగా పూలమాలలు సిద్ధం చేస్తారు.

ఉత్సవమూర్తులకు నిత్యమూ అలంకరించే పూలదండల వివరాలు:

భోగ శ్రీనివాసమూర్తికి: ఒక దండ

కొలువు శ్రీనివాసమూర్తికి: ఒక దండ

శ్రీదేవి భూదేవి సహిత మలయ్పప్పస్వామికి: మూడు దండలు

శ్రీదేవి భూదేవి సహిత ఉగ్రశ్రీనివాసమూర్తికి: మూడు దండలు

శ్రీ సీతారామలక్ష్మణులకు: మూడు దండలు

శ్రీ రుక్మిణీ శ్రీకృష్ణులకు: రెండు దండలు

చక్రత్తాళ్వారుకు (సుదర్శనుడు): ఒక దండ

అనంత గరుడ విష్వక్సేనులకు: మూడు దండలు

సుగ్రీవ అంగద హనుమంతులకు: మూడు దండలు

తిరుమల లడ్డూ ఎలా తయారు చేస్తారు? - ఏయే వస్తువులు వినియోగిస్తారో తెలుసా! - How to make Tirumala Laddu

ఇతర విగ్రహమూర్తులకు నిత్యమూ అలంకరించే పూలదండలు:

బంగారువాకిలి ద్వారపాలకులు: రెండు దండలు

గురడాళ్వారు: ఒక దండ

వరదరాజస్వామి: ఒక దండ

వకుళమాలిక: ఒక దండ

భగవద్రామానుజులు (మూలమూర్తి, ఉత్సవమూర్తి): రెండు దండలు

యోగనరసింహస్వామి: ఒక దండ

విష్వక్సేనులవారికి: ఒక దండ

పోటు తాయారు: ఒక దండ

బేడి ఆంజనేయస్వామికి: ఒక దండ

శ్రీ వరాహస్వామి ఆలయానికి: మూడు దండలు

కోనేటిగట్టు ఆంజనేయస్వామికి: ఒక దండ (ప్రతి ఆదివారం మాత్రమే)

'తిరుమలలో అక్కడ స్నానం చేస్తే మోక్షప్రాప్తి'- 'శ్రీవారి కంటే ముందుగా ఆయనకే నైవేద్యం' - Adivaraha Kshetram

ఇంకా శ్రీస్వామివారి నిత్యకల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊరేగింపులు, ఉత్సవాలకుగాను ప్రత్యేకంగా పూలమాలలు కూర్చుతారు. స్వామివారికి అలంకరించే మాలలకు తిరుమల క్షేత్రంలో తులసి, చామంతులు, గన్నేరులు, సన్నజాజులు, మొల్లలు, మొగిలి, కమలం (తామర), కలువ, రోజాలు, గులాబీలు, సంపెంగలు, సుగంధాలు, మామిడాకులు, తమలపాకులు, పచ్చి పసుపుచెట్లు, కనకాంబరం, మరువం, మాచీపత్రం, దవనం, బిలువం (మారేడు) ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలు వెదజల్లే ఎన్నో పుష్ప జాతులను, పత్రాలను శ్రీవారి పుష్పకైంకర్యంలో వినియోగిస్తారు.

ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు పూటలా శ్రీస్వామివారికి జరిగే తోమాలసేవ (పుష్ప కైంకర్యం)కు ఈ పుష్పఅర నుంచి సిద్ధం చేసిన పూలమాలలను, జియ్యంగార్లు తలపై పెట్టుకొని బాజాభజంత్రీలతో ఛత్రచామర మర్యాదలతో వేదమంత్రోచ్ఛారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పిస్తారు.

సంపూర్ణ పుణ్యఫలం లభించాలంటే - ఈ ఆలయాలకు వెళ్లాకే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలి! - Right Sequence of Tirumala Tour

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.