ETV Bharat / snippets

మన దేవరకు మన సరకు - తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలిసారిగా పలాస జీడిపప్పు

Palasa Cashew Are Using In Tirumala Prasadam Making
Palasa Cashew Are Using In Tirumala Prasadam Making (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 27, 2024, 12:22 PM IST

Palasa Cashew Are Using In Tirumala Prasadam Making : తిరుమల తిరుపతి దేవస్థానానికి తొలిసారిగా శ్రీకాకుళం జిల్లా పలాస జీడిపప్పును పంపించారు. జీడి పప్పు తీసుకెళ్తున్న వాహనాన్ని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష జెండా ఊపి ప్రారంభించారు. జీడిపప్పు సరఫరా చేసేందుకు కాశీబుగ్గ పారిశ్రామికవాడలోని ఎస్‌ఎస్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ ఆగ్రో ఉత్పత్తుల సంస్థకు ఇటీవల టెండర్‌ ఖరారైంది. ఈ మేరకు 10 టన్నుల సరకును పంపించారు. నాణ్యతలో రాజీ పడకుండా మేలురకం పంపిస్తామని సంస్థ యజమాని సంతోష్‌ కుమార్‌ తెలిపారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి జీడిపప్పు పంపించడం ఆనందంగా ఉందని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.