Vijayawada Lenin Center Book Stalls: ఎక్కడా లభ్యంకాని పుస్తకాలు సైతం విజయవాడలోని లెనిన్ సెంటర్ అందుబాటులో ఉంటాయి. పాఠకులు, విద్యార్థులు, నిరుద్యోగులకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. 30, 40 ఏళ్ల క్రితం నాటి పుస్తకాలు సైతం ఇక్కడ లక్ష్యమౌతాయి. ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన అన్ని పుస్తకాలూ ఇక్కడ లభిస్తాయి. ఆధ్యాత్మికం, అభ్యుదయం, పురాణాలకు సంబంధించిన పుస్తకాలతో పాటు విద్యార్థులు, నిరుద్యోగులకు అవసరమైన బుక్స్ అన్ని రకాలు పుస్తకాలు ఇక్కడ కొనుగోలు చేయొచ్చు.
వ్యక్తిత్వ వికాశానికి సంబంధించిన అనేక పుస్తకాలు లభిస్తాయి. పాఠకులు, విద్యార్థులు, నిరుద్యోగులకు అవసరమైన కొత్త పుస్తకాలతో పాటు పాత పుస్తకాలూ దొరుకుతాయి. తక్కువ ధరకే పాత పుస్తకాలు పేద, మధ్య తరగతి ప్రజలకు లభిస్తాయి. అందుకే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాఠకులతో పాటు దేశ, విదేశాలకు చెందిన అనేక మంది పుస్తక ప్రియులు ఇక్కడకు వచ్చి కొనుగోలు చేస్తుంటారు. పాఠకులకు అవసరమైన పుస్తకాలు ఇక్కడ లభ్యం కావడంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ రచయితలు రాసిన కవితలు, నవలలు, జీవిత చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు సైతం ఇక్కడ దొరకడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పాఠకులకు అవసరమైన పుస్తకాలు దొరకడంతో పాటు, అవసరం లేని పుస్తకాలు అమ్ముకోవడానికీ ఇక్కడ అవకాశం ఉంది. దీంతో తమకు అవసరం లేని పుస్తకాలను అమ్మి, అవసరం అయిన వాటిని ఇక్కడ నుంచి కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడి షాపు వాళ్లు, ఆ కొనుగోలు చేసిన పుస్తకాలను అవసరమైన వారికి తక్కువ ధరకే అందిస్తుంటారు. విజయవాడ లెనిన్ సెంటర్లో పుస్తకాలకు సంబంధించిన 30కి పైగా షాపులు ఉన్నాయి.
వెయ్యి మందికి పైగా ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో ఆన్లైన్లో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండటంతో, తమ వ్యాపారాలకు నష్టం కలిగిస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. గత యాభై ఏళ్లుగా తమ తండ్రులు, తాము పుస్తకాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నామని వ్యాపారులు పేర్కొంటున్నారు. తమకు విజయవాడలో ఓ ప్రత్యేక కాంప్లెక్స్ నిర్మించి ఇస్తే ప్రభుత్వానికి అద్దెలు రావడంతో పాటు తమ వ్యాపారం మరింత పెరిగేందుకు అవకాశం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
"విజయవాడ లెనిన్ సెంటర్లో దొరకని పుస్తకం అంటూ ఉండదు. ఇది సెకండ్ హ్యాండ్ మార్కెట్ కావడం వలన, పేద పిల్లలకు ఉపయోగంగా ఉంటుంది. తక్కువ ధరకే పుస్తకాలు అమ్ముతాము. అదే విధంగా వారి దగ్గర నుంచి కొంటాము. మా నాన్నగారి ఉన్నప్పుడు నుంచీ ఇక్కడ షాప్ నడుపుతున్నాము. అన్ని రకాలు పుస్తకాలు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ వలన బిజినెస్ నడవటం చాలా కష్టంగా ఉంది. మాకు ఏదైనా కాంప్లెక్స్ కట్టించి ఇవ్వాలని, మేము చాలా సంవత్సరాలుగా వచ్చిన ప్రతి ప్రభుత్వానికి కోరుతున్నాము". - వ్యాపారి
డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనంపై పెరుగుతోన్న ఆసక్తి - Youth interested For Reading Books