national

ETV Bharat / snippets

నేడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 6:50 AM IST

CM Chandrababu Naidu Visit North Andhra District
CM Chandrababu Naidu Visit North Andhra District (ETV Bharat)

CM Chandrababu Naidu Visit North Andhra District :ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి దార్లపూడివద్ద పోలవరం ఎడమ కాలువను పరిశీలిస్తారు. తర్వాత భోగాపురం విమానాశ్రయాన్ని సందర్శించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం సీఐఐ కాన్ఫరెన్స్‌లో వర్చువల్‌గా పాల్గొంటారు. మెడ్‌టెక్‌ జోన్‌ వర్కర్లతో సమావేశమవుతారు. అనంతరం విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అధికారులతో సమావేశమై ఐదేళ్లుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టుల స్థితిగతులపై సమీక్షిస్తారు. రాత్రికి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details