ETV Bharat / state

కార్తిక పౌర్ణమి రోజున క్షుద్రపూజల కలకలం - వైఎస్సార్సీపీ నేతలు అరెస్ట్ - OCCULT CULTS IN ANNAMAYYA DISTRICT

బి.కొత్తకోట మండలంలో క్షుద్రపూజల కలకలం

Occult Cults in Annamayya District
Occult Cults in Annamayya District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 16, 2024, 7:12 PM IST

Occult Cults in Annamayya District : ప్రపంచాన్నే మార్చేసే పరిజ్ఞానం వచ్చినా, కొన్ని గ్రామాల్లో మాత్రం నేటికీ అజ్ఞానానిదే పైచేయిగా నిలుస్తోంది. దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నా ఇంకా కొంతమంది మూఢనమ్మకాలను వీడడం లేదు. చాలా చోట్ల ఇంకా వాటిని పాటిస్తున్నారు. గుప్త నిధుల కోసం, కొడుకు పుడతాడని, కోటీశ్వరుడు కావాలనే ఆశలతో కొంతమంది మంత్రగాళ్ల మాటలు నమ్మి ఇలాంటి వాటి పట్ల ఆకర్షితులవుతున్నారు. చదువుకున్న వారు సైతం ఈ ఉచ్చులో చిక్కుకోవడం గమనార్హం. తాజాగా ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరేమో డాక్టర్, మరొకరెమో రాజకీయ నేత. వీళ్లీద్దరూ ఒక్కటై క్షుద్రపూజలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది.

వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు నాయకులు ఓ గుడిలో క్షుద్ర పూజలు చేయడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. డాక్టర్ ఏవీ సుబ్బారెడ్డి చిన్నపిల్లల ప్రత్యేక వైద్యుడిగా పేరు పొందారు. ఆయన బీజేపీలో చాలాకాలంగా పలు హోదాల్లో పని చేశారు. అనంతరం ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. మరొకరు అనంతపురం జిల్లా కదిరికి చెందిన ఆ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ, హిందూపూర్ పార్లమెంట్ ఎన్నికల ఇంఛార్జ్​ వజ్ర భాస్కర్​రెడ్డి.

Occult Cults in Annamayya District
క్షుద్రపూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నేతలు (ETV Bharat)

వీరిద్దరూ బి.కొత్తకోట మండలంలోని బలకవారిపల్లె అటవీ ప్రాంతంలో ఓ పురాతన దేవాలయంలో శుక్రవారం నాడు కార్తిక పౌర్ణమి రోజున క్షుద్రపూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు వ్యక్తులు ఈ తతంగాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్​గా మారింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని వారిని పట్టుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు.

నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించామని చెప్పారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మూఢనమ్మకాల పేరుతో ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కొండయ్య నాయుడు హెచ్చరించారు. మరోవైపు ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు.

కాలేజీ బస్సులో క్షుద్రపూజలు.. భయాందోళనకు గురైన విద్యార్ధులు

క్షుద్రపూజల పేరుతో కన్నకూతురిని చంపిన తల్లి!.. వంటగదిలోనే పూడ్చిపెట్టి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.