national

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు - ఇంజినీరింగ్​ స్టూడెంట్​ సూసైడ్​

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 27, 2024, 2:09 PM IST

suicide
suicide (ETV Bharat)

Engineering Student Suicide on Online Loan Trap : ఆన్‌లైన్‌ రుణయాప్‌ మరో నిండు జీవితాన్ని బలి తీసుకుంది. ఉన్నత చదువులు చదివి వృద్ధిలోకి వస్తాడనుకున్న కన్నకొడుకు రుణయాప్‌ల ఉచ్చులో చిక్కుకుని బయటపడలేక ప్రాణాలు బలి తీసుకున్నాడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విజయవాడ సమీపంలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న వంశీ రుణయాప్ నిర్వాహకుల ఒత్తిడి తట్టుకోలేక కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వృద్ధిలోకి వస్తాడనుకున్న కుమారుడు విగతజీవిగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు.

చదువులో ఎప్పుడూ ముందుండే విద్యార్థి అనూహ్యంగా ఆన్‌లైన్‌ రుణయాప్‌ల వలకి చిక్కాడు. మరో రెండు, మూడు నెలల్లో ప్రాంగణ నియామకాల్లో ఎంపికై సాప్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాల్సిన యువకుడు అధిక వడ్డీ రుణాలు చెల్లించలేక ఆర్థాంతరంగా ఆత్మహత్య చేసుకుని తనవు చాలించాడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details