ఆస్పత్రిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
Published : Oct 1, 2024, 9:29 AM IST
MLC Kavitha Admitted to Hospital :బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నగరంలోని ఓ ఆస్పత్రిలో చేరారు. వైద్యపరీక్షల కోసం ఆమె చేరినట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. దిల్లీ మద్యం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్నప్పుడు కవితకు గైనిక్ సమస్యలు వచ్చాయి. జ్వరంతో పలుసార్లు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పట్లో దిల్లీ ఎయిమ్స్‌లో ఆమె చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి నేడు ఆస్పత్రిలో చేరి, హెల్త్ టెస్టులు చేయించుకుంటున్నారు. సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తికానున్నట్లు సమాచారం.