national

ETV Bharat / snippets

హామీలపై కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయండి - యువతకు హరీశ్​రావు పిలుపు

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

HARISHRAO TWEET ON CONG MANIFESTO
Harishrao slams Congress (ETV Bharat)

Harishrao slams Congress :దసరా సందర్భంగా కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని తెలంగాణ గ్రామీణ యువతకు మాజీ మంత్రి హరీశ్​రావు పిలుపునిచ్చారు. గతేడాది దసరా సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మి, తమ భవిష్యత్ కోసం కాంగ్రెస్​కు ఓటేయాలని ఊర్లలో ప్రచారం చేసి మిమ్మల్ని ప్రభుత్వం వంచించిందని అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోగా, అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదని, రుణమాఫీ పూర్తి చేయలేదని, రైతు బంధు నిలిపివేశారని మండిపడ్డారు.

రైతు భరోసాకు దిక్కు లేదని, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామన్న ప్రభుత్వం 10 నెలలు గడిచినా అతీగతీ లేదన్నారు. రూ.4 వేల నిరుద్యోగ భృతికి నీళ్లొదిలారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారెంటీలతో పాటు, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్‌లపై ఎక్కడికక్కడ నిలదీయాలని హరీశ్​రావు పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details