ETV Bharat / snippets

హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో వర్షం - జలమయమైన రహదారులు

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

HYDERABAD RAINS 2024
Rain in Hyderabad (ETV Bharat)

Rain in Hyderabad : హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగరవాసులకు, అకస్మాత్తుగా వర్షం పడటంతో వాతావరణం చల్లబడి వేడిమి నుంచి ఊరట కలిగింది. మేడ్చల్, కండ్లకోయ, కిష్టాపూర్, దుండిగల్‌, బహదూర్‌పల్లి, సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌లో వర్షం పడింది. కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, గండిమైసమ్మ, గాగిల్లాపూర్​లోనూ వర్షం పడింది. రోడ్లపై భారీగా నీళ్లు చేరాయి. పాదాచారులు, వాహనాదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోడ్లపై నీటిని క్లియర్ చేసేందుకు జీహెచ్​ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. నీరు నిల్వకుండా చర్యలు చేపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.